‘ స‌లార్ ‘ టీజ‌ర్‌.. బిగ్‌స్క్రీన్‌పై భారీ యాక్ష‌న్ ట్రీట్ ( వీడియో )

గత కొద్ది రోజులు నుంచి కూడా ఊహించని లెవెల్లో పాన్ ఇండియా సినిమాను ఊపేస్తోన్న ఒకే ఒక సినిమా స‌లార్‌. కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్‌రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే ఇండియ‌న్ సినిమా వ‌ర్గాల్లో ఓ సంచ‌ల‌నంగా మారింది. ఈ సినిమా అప్పట్లో కేవలం అనౌన్స్మెంట్ చేసిన‌ప్పుడే రికార్డులు సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఈ యేడాది సెప్టెంబ‌ర్ 28న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో చిన్న శాంపుల్‌గా ఈ రోజు టీజ‌ర్ వ‌దిలారు. ఈ టీజ‌ర్ కోసం కొన్ని కోట్ల క‌ళ్లు ఎదురు చూస్తున్నాయి. దాదాపు నిమిషం న్న‌ర పాట ఉన్న టీజ‌ర్ చూస్తుంటేనే మ‌నం వెండితెర‌పై ఓ భారీ యాక్ష‌న్ ట్రీట్‌కు రెడీ కాబోతున్నాం అన్నది తేలిపోయింది.

ప్ర‌శాంత్ నీల్ త‌న‌కు అల‌వాటైన రేంజ్‌లో డార్క్ షేడ్‌లో స‌లార్ సినిమాను ప్ర‌జెంట్ చేశాడు. ఈ డార్క్ షేడ్‌లో సీనియ‌ర్ న‌టుడు ప్రభాస్‌పై ఇచ్చిన ఎలివేష‌న్ అయితే అదిరిపోయింది. టీజ‌ర్ ఆద్యంతం ఆనంద్ ఇస్తోన్న ఎలివేష‌న్‌, అటు యాక్ష‌న్ క‌ట్స్‌తోనే నింపేశారు. టీజ‌ర్‌లో ప్ర‌భాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం హైలెట్‌.

ఇక ర‌విబ్ర‌సూర్ సంగీతం కూడా టీజ‌ర్‌ను బాగా ఎలివేట్ చేసింది. నటుడు పృథ్వీ రాజ్ ని కూడా మేకర్స్ బాగా చూపించారు. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా వ‌స్తుంద‌న్న ప్ర‌చారం నిజం చేస్తూ ఈ సెప్టెంబ‌ర్ 28న పార్ట్ 1 రిలీజ్ అవుతుంద‌ని క్లారిటీ ఇచ్చేశారు. ఏదేమైనా టీజ‌రే ఈ రేంజ్‌లో ఉందంటే రేపు ట్రైల‌ర్ అయితే తాండ‌వం చేయ‌డం ఖాయం.