” ఫిదా ” సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది సాయి పల్లవి. తెలంగాణ యాసతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి చాలా మొండిఘటం. సినిమా ఆఫర్ ఇచ్చేది ఎంత బడా డైరెక్టరైనా కథ నచ్చకపోతే.. ముఖంపైనే నో చెప్పేస్తుందట. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ పాత్రల్లో మాత్రమే నటిస్తున్న సాయి పల్లవి.. ఇకపై టాలీవుడ్ లో సినిమాలలో కనిపించదంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తున్న సాయి పల్లవి తెలుగులో మాత్రం నటించి సంవత్సరం అయింది. ఇప్పటికి కొత్త సినిమాలకి సైన్ చేయడం లేదు. ” విరాటపర్వం ” సినిమా తర్వాత ఒక్క టాలీవుడ్ మూవీ కూడా సాయి పల్లవి ఒప్పుకోలేదు. దీంతో సాయి పల్లవి తెలుగు సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఏంటి? అనే దానిపై ప్రేక్షకుల్లా సందేహం మొదలైంది.
ఇటీవల టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఈ ట్రెడిషనల్ బ్యూటీని కాల్ షీట్స్ కోసం అప్రోచ్ కాగా తెలుగులో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పిందట. కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తున్నా.. ఆమె చెప్పే కండిషన్స్ కు ఓకే చేసినా.. ఈ బ్యూటీ తెలుగు సినిమాలు ఎందుకు సైన్ చేయడం లేదు? టాలీవుడ్ పై సాయి పల్లవికి కోపంగా ఉందా? సినిమాల్లో నటించ పోవడానికి కారణం ఏమై ఉంటుంది? అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లోనూ ఈ న్యూస్ చర్చగా మారింది.