సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ఆయ‌న‌తో గొడ‌వ… అందుకేనా సినిమాల‌కు బ్రేక్‌..!

ఎస్ ఇప్పుడు టాలీవుడ్ ఇన్స‌ర్ స‌ర్కిల్స్‌లో ఇదే మాట బాగా వైర‌ల్ అవుతోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాల‌కు ఆరు నెల‌ల పాటు గ్యాప్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నా కొన్ని ఆరోగ్య స‌మస్య‌లు ఉన్నాయ‌ని.. వాటిని సెట్ చేసుకున్నాక తాను తిరిగి సినిమాలు చేస్తాన‌ని తేజ్ ప్ర‌క‌టించారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే సాయిధ‌ర‌మ్ కొన్ని సినిమాలు చేశాక ఈ గ్యాప్ తీసుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఓ నిర్మాత‌తో త‌లెత్తిన విబేధాల వ‌ల్లే ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు స‌డెన్‌గా సినిమాల‌కు గ్యాప్ ప్ర‌క‌టించార‌ని అంటున్నారు.

సీనియ‌ర్ నిర్మాత భోగవిల్లి బాపినీడు నిర్మాణంలో మరో సినిమా చేయాలి. అయితే లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం ఆ సినిమా క్యాన్సిల్ అయిందని అంటున్నారు. ఇందుకు కార‌ణం ? సాయిధ‌ర‌మ్‌కు నిర్మాతకు మ‌ధ్య వచ్చిన అభిప్రాయ బేధాలే అంటున్నారు. ఇదే బ్యాన‌ర్లో సాయిధ‌ర‌మ్ మొత్తం మూడు సినిమాలు చేయాలి.. ఇప్పటికి రెండు పూర్తి అయ్యాయి.

మూడో సినిమాకు బాపినీడుతో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామి. బ్లాక్‌బ‌స్ట‌ర్ విరూపాక్ష సినిమాకు రెమ్యూనిరేషన్ తో పాటు సాయిధ‌ర‌మ్‌కు లాభాల్లో వాటా అనే ప్రాతిపదికన చేసారు. అయితే నిర్మాత రు. 45 కోట్ల ఖ‌ర్చు అయ్యింద‌ని ఓచ‌ర్ల‌తో స‌హా హీరో అడిగినట్టుగా లెక్క‌లు చూపించార‌ట‌. అయితే అందుల్లో కొన్ని తేడాలు ఉన్నాయ‌ని హీరో నిర్మాత అభిప్రాయంతో అంగీక‌రించ‌లేద‌ని అంటున్నారు.

సో ఇక్క‌డే తేడా కొట్టేసింది. దీంతో ఇప్పటికిప్పుడు ఇదే బ్యాన‌ర్లో సాయి చేయాల్సిన సినిమాను ప‌క్క‌న పెట్టేశారు. ఈ సినిమాతో పాటు సంప‌త్‌నంది సినిమాలు రెండు ఒకేసారి చేయాలి. అందుకే ఇప్పుడు దీనిని ప‌క్క‌న పెట్టేసి ఆరు నెల‌ల గ్యాప్ త‌ర్వాత సంక్రాంతి నుంచి త‌న కొత్త సినిమాతో సెట్ మీదకు వెళ్లే ఆలోచన చేస్తున్నాడ‌ట సాయిధ‌ర‌మ్‌