మ‌రో హీరోయిన్ ప్రేమ‌లో సాయిధ‌ర‌మ్ తేజ్‌… ఫుల్ క్లారిటీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుప్రీమ్‌ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. 2016లో సాయి న‌టించిన‌ తిక్క సినిమా హీరోయిన్ లారీసా బోనేసితో ప్రేమలో పడ్డారని గతంలో వార్తలు వినిపించాయి. ఆమె బ్రెజిలీయ‌న్ మోడ‌ల్‌. సాయి ధరమ్ తేజ్ లారీసాకు ప్రపోజ్ కూడా చేశాడని వార్తలు వైరల్ అయ్యాయి. 2021లో సాయిధరమ్ తేజ్ బర్త్ డే రోజు లారీసా నేన్ను ప్రేమలో ఉన్నానంటూ ట్విట్ చేసింది.

గత ఏడది పుట్టినరోజు తేజ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్ను ఎప్పటికీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను అని ప్రేమగా రిప్లై ఇచ్చింది. సాయిధరమ్ తేజ్ దానికి టు మై డిస్టర్బెన్స్ అంటూ ల‌వ్‌ సింబ‌ల్స్‌ రిప్లై ఇచ్చాడు. దీంతో వారిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవల సాయి ధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీ బ్రో సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సాయి ధరమ్‌తేజ్‌ చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు.

ఈ ప్రమోషన్ల‌లో భాగంగా తేజ్, హీరోయిన్ కేతిక‌ శర్మ సోషల్ మీడియాలో నెటిజ‌న్స్‌తో కాన్వర్జేషన్ చేశారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను సాయిధరమ్ తేజ్ వివరించాడు. ఇక ఈ కాన్వర్జేషన్ లో భాగంగా ఒకరు తేజ్ ని లారీసా బోనేసి వదిన ఎలా? ఉందన్నా అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు తేజ్ బదులు ఇవ్వకుండా కాసేపు సైలెంట్‌గా ఉండి తర్వాత క్వ‌శ్చ‌న్ నాకు అర్థం కాలేదు అంటూ రిప్లై ఇచ్చాడు.

మళ్లీ రిపీట్ చేయగా క్వశ్చన్ ఏంటి ? అంటూ బదిలిచాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా లేడంటూ అర్థమైంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజెన్స్ వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది లారీసా పేరులో ఉన్న వైబ్రేషన్ అలాంటిది అంటు ఈ కామెంట్స్ ని హైలెట్ చేస్తున్నారు.