టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సదా. 20 ఏళ్ల క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో ఆమె వెండితెరకు హీరోయిన్గా పరిచయం అయ్యింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ బుల్లితెరపై కొన్ని డాన్స్ షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ క్రేజీగా దూసుకుపోతుంది సదా.
40 ఏళ్ళ వయసు పైబడినప్పటికీ ఇంకా సదా పెళ్లి చేసుకోలేదు. దీంతో సదా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదేంటి ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అంటూ.. చాలామంది నెటిజెన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రశ్నలకు స్పందించిన సదా పెళ్లి చేసుకుంటే నాకు నచ్చినట్టు నేను ఉండలేను.. నా ఫ్రీడం పోతుందని చెప్పింది.
నా మనసును అర్థం చేసుకొని.. నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనిచ్చి.. నాకు ఫ్రీడం ఇచ్చే వ్యక్తి దొరికినప్పుడే నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయినా ఇప్పుడు చాలామంది గొప్పగా పెళ్లి చేసుకుని కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్న సంగతి చూస్తూనే ఉన్నా.. అలా పెళ్లి చేసుకుని విడిపోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే చాలా చాలా బెటర్ అంటూ కాస్త ఘాటుగా స్పందించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సదా చేసిన ఈ కామెంట్స్ వైరల్ చేస్తు హీరోయిన్ సమంత, మెగా డాటర్ నిహారిక గురించి మాట్లాడిందంటూ.. వారిద్దరినీ టాగ్ చేస్తూ ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. నిజంగానే వీళ్ళలా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం కన్నా.. సదా చెప్పినట్టు సింగిల్ గా ఉండడం బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.