RRR సినిమా సీక్వెల్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌… రాజ‌మౌళి కాదు.. మీరు ఊహించ‌ని పేరు..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్‌ ఆర్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఈ సినిమా ఏకంగా గ్లోబల్ అవార్డుతో పాటు ఆస్కార్ అవార్డు సైతం దక్కించుకుంది. టాలీవుడ్ లోనే ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టార‌ర్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని రచ‌యిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించడంతో ఒక్కసారిగా సెన్సేషనల్ టాపిక్ అయింది.

అయితే ఈ సినిమా సీక్వెల్‌ ఎప్పుడు ? ఉంటుంది.. ఎవరు ? డైరెక్ట్ చేస్తారు ఎప్పుడు ? రిలీజ్ అవుతుంది అన్నదానిపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెలను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా ? లేదా రాజమౌళి పర్యవేక్షణలో మరొకరు డైరెక్ట్ చేస్తారా ? అన్నది కూడా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాపై రాజమౌళి కాంపౌండ్ నుంచి వస్తున్న రూమర్ల ప్రకారం వైవిధ్య‌మైన సినిమాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఈ సినిమాకు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ చేసినా క‌థ‌ విజయేంద్రప్రసాద్ అందిస్తారని.. సినిమా అంతా కూడా రాజమౌళి పర్యవేక్షణలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఉంటుందని తెలుస్తోంది. 2025 లేదా 2026లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.