RRR 2 స్టోరీ లైన్ రెడీ… ఈ సారి ఏ బ్యాక్‌డ్రాప్ అంటే…!

 

దర్శ‌క ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన మల్టీ స్టార‌ర్ మూవీ ఆర్ఆర్ ఆర్. తెలుగు సినీ పరిశ్రమలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన ఈ సినిమాను డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్లతో బీభత్సం సృష్టించింది. అంతే కాకుండా వరల్డ్ వైడ్ గా ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ అవార్డ్స్ ని దక్కించుకున్న ఈ సినిమా అందులో భాగంగానే ఆస్కార్ అవార్డ్‌ను కూడా అందుకుంది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. 95వ అకాడమిక్ అవార్డ్స్ లో ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఈ సాంగ్ కి అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్‌ల‌కి కూడా ఈ సినిమా ద్వారా అవార్డు వచ్చింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆర్ఆర్ఆర్‌ సినిమాకు సీక్వల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఆ సినిమా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అయితే దీన్ని రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చు అని వివరించారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వెల్ వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. దాదాపు డైరెక్టర్ ఆయనే అని ఫిక్స్ అయ్యారట.

ఇక మరో విషయం ఏంటంటే ఈ సినిమా ఆఫ్రికా నేపథ్యంలో సాగబోతుందని తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాను తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఈ సినిమా నవంబర్లో మొదలుకానుందని సమాచారం. ఈ సినిమా జోన్స్ స్టైల్లో అడ్వెంచర్స్ జానర్‌లో తెరకెక్కక బోతుందని రాజమౌళి వివరించాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించబోతుందట.