రేణుదేశాయ్ అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తెలుసా..!

రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి జానీ, బద్రి సినిమాలో నటించింది. ఇందులో జానీ సినిమా టైంకే రేణు, ప‌వ‌న్ ప్రేమ పీక్స్‌కు చేరుకుంది. ఈ సినిమాకు ప‌వ‌న్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాకు కూడా రేణు దేశాయ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింది.

పవన్ కళ్యాణ్ సినిమాలకు స్టైలిస్ట్ గా కూడా వర్క్ చేసిందట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ స్వయంగా వివరించింది. పవన్ కళ్యాణ్ ఖుషి షూటింగ్ లండన్ లో జరిగే టైంలో కాస్ట్యూమ్ కోసం పవన్ కళ్యాణ్ వెతుకుతుండగా ఆయనకు కలర్ కాంబినేషన్లో కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసి ఇచ్చింది తానే అని… ఆయనకు ఆ కాంబినేషన్ నచ్చడంతో అప్ప‌టి నుంచి తాను పవన్ కళ్యాణ్ సినిమాలకు స్టైలిస్ట్ గా పని చేశాన‌ని రేణు చెప్పింది.

అసలు తెలుగు పరిశ్రమకు స్టైలిస్ట్ అనే పదం పరిచయమైంది త‌న‌ వల్లే అని… స్టైలిస్ట్ కి, కాస్ట్యూమ్ డిజైనర్ కి చాలా తేడా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకు స్టైలిష్ గా చేశాక‌… ఆ తర్వాత బాలు, గుడుంబా శంకర్, బంగారం, జల్సా సినిమాలకు కూడా స్టైలిస్ట్ గా పని చేశాన‌ని రేణు తెలిపింది.

రేణు కుటుంబంలో ఆమె కంటే ముందుగా ఒక ఆడపిల్ల పుట్టిందని.. ఆ తర్వాత మగపిల్లాడు పుడతాడు అనుకుంటే రేణు పుట్టింద‌ట‌. దీంతో ఆ కుటుంబంలో వాళ్లు రేణును ఇష్టపడేవారు కాదట‌. వారి దగ్గర ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో రేణు టీనేజ్ నుంచే ఎంజాయ్ చేయకుండా చాలా నిజాయితీగా, శ్రద్ధగా పెరిగింద‌ట‌. అందుకే ఇప్పుడు త‌న‌ పిల్లలు మాత్రం సాధారణ లైఫ్ ఎంజాయ్ చేస్తూ పెరిగేలా చూసుకుంటున్నానని చెప్పింది.