ఇటు రేణు దేశాయ్.. అటు పూనమ్ కౌర్.. వీళ్లిద్దరు ఏ పోస్టు పెట్టినా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఆసక్తిగాను, టెన్షన్‌గాను ఉన్నట్టే కనిపిస్తోంది. వీళ్లిద్దరు ఏ పోస్టు పెట్టినా కూడా పవన్ అభిమానులు దానిని తమ హీరోకే అన్వయించుకుంటోన్న పరిస్థితి వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో అనవసరపు ట్రోలింగ్, చర్చలు.. కౌంటర్లు, రీ కౌంటర్లు ఇవన్నీ చివరకు పవన్‌కు చేరి పవన్ అసహనం వ్యక్తం చేసే వరకు వెళుతోంది.
తాజాగా చాలా రోజుల తర్వాత పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఓ పోస్టు పెట్టారు. తన సోషల్ మీడియా ఎకౌంట్ డ్యాష్ బోర్డ్ చెక్ చేసిన ఆమె తన రియాక్షన్ చెప్పారు. తాను చాలా కాలం తర్వాత డ్యాష్ బోర్డ్ చెక్ చేశాను. నన్ను ఫాలో అవ్వకుండానే నా అక్కౌంట్, నా చెక్ చేసే వాళ్లు దాదాపు 10 లక్షల మంది ఉన్నారని చెప్పారు. కొందరు అయితే స్పెషల్‌గా తన ప్రొఫైల్ శోధిస్తున్నారు. నన్ను ఫాలో అవ్వకుండా, నా ఎకౌంట్ అంతలా చెక్ చేస్తోంది ఎవరో ? గట్టిగా ఆలోచించాల్సిన విషయమే అని తెలిపింది.
రేణు పెట్టిన ఈ పోస్టు చూసి సహజంగానే పవన్ అభిమానులను గుచ్చుకునేలా ఉంది. అయితే రేణు మాత్రం తన పోస్టులో ఎక్కడా ? ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. ఇక పవన్‌ను పదే పదే తన మాటలు, కామెంట్లతో పోడిచే పూనమ్‌కౌర్ కూడా ఓ పోస్టు పెట్టింది. మనసు పొరల్లో లోతుగా పేరుకుపోయిన భయం వల్ల తీవ్రవాద దృక్పథం ఉంటుంది.. దీని వల్ల ఇంటర్నల్‌గా అభద్రతాభావం, ఇతరుల ప్రాధమిక హక్కుల్ని తిరస్కరించడం నుంచి భయం కలుగుతుంది… దీనివల్ల నిస్సహాయత.. ఆ తర్వాత హింస చెలరేగుతాయి.. వీటిని ప్రజలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని నేను ప్రార్థిస్తున్నానని కామెంట్ చేసింది.
పూనమ్ కామెంట్ ప్రస్తుతం పవన్ చేస్తోన్న రాజకీయ ప్రసంగాలను ఉద్దేశించే అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతున్నారు. ఏదేమైనా రేణుదేశాయ్, పూనమ్ ఎప్పుడు ఏం కామెంట్ పెట్టినా అది పవన్ ఫ్యాన్స్‌ను ఎక్కడో టచ్ చేసేలా వాళ్లు ఫీల్ అయ్యి సోషల్ మీడియాలో లేనిపోని రచ్చతో పవన్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారు.