చిత్ర పరిశ్రమ అంటేనే ఎవరూ ఊహించని ఓ వింత ప్రపంచం ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దర్శకనిర్మాతలు ఏ సినిమాకైనా కథను బట్టి హీరో, హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారు. కానీ కొన్ని అనుకోని కారణాల కారణంగా రెమ్యూనరేషన్ లో వచ్చిన విభేదాల వల్ల ముందుగా అనుకున్న హీరో హీరోయిన్లు తప్పించి కొత్తవారితో సినిమాలు చేయటం చిత్ర పరిశ్రమలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
అలా ముందుగా అనుకున్న హీరో హీరోయిన్లకు ఒక సినిమా అవకాశం చేజారిపోతే వారు ఎంతో బాధపడతారు. ఇలాంటి సమస్యే ఓ హీరో జీవితంలో ఎదురైంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతని జీవితంలో జరిగిన ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ను మొదలుపెట్టి.. తర్వాత ఫ్యామిలీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్. అదే సమయంలో ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సపోర్టింగ్ యాక్టర్ గా కూడా నటించాడు. చాలా కాలం తర్వాత అఖండా సినిమాతో మళ్ళీ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సమయంలో శ్రీకాంత్ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో జరిగిన చేదు సంఘటన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాక మొదట్లో హీరోగా అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం వరుసగా విలన్ పాత్రలు చేసుకుంటూ వెళ్లేరట. అదే సమయంలో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తనలో హీరోని చూసి వన్ టూ చిత్రంలో అవకాశం ఇచ్చారట. ఆ తర్వాత తాజ్ మాహాల్ సినిమాలు నా కెరీర్ కు మంచి హెల్ప్ అయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. వాటి తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తన కెరియర్ మరో లెవల్ కి వెళ్ళింది వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా హీరో అవకాశాలు వచ్చాయి.
ఇక అలా ఒకానొక సమయంలో సంవత్సరానికి 13 సినిమాలు కూడా చేశాను పగలు రాత్రి అనే తేడా లేకుండా సినిమా షూటింగులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే రాజశేఖర్ హీరోగా వచ్చిన వేటగాడు సినిమాలో మొదటగా శ్రీకాంత్నే హీరోగా అనుకున్నారట. కానీ కొన్ని అనుకోని కారణాల కారణంగా నన్ను హీరో పాత్ర నుంచి తప్పించారని చెప్పుకొచ్చారు. వేటగాడు సినిమాలో సౌందర్య- రంభ హీరోయిన్లుగా అని తెలియడంతో నాకు ఎంతో ఆనందం వేసింది. కానీ చివరి క్షణంలో నన్ను తీసేయడంతో అంతకు ఎక్కువగా బాధపడ్డానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. అయితే వేటగాడులో హీరోగా తొలగించినప్పటికీ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఇంట్రెస్టింగ్ పాత్ర చేశారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.