రవితేజ కేరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన టాప్ 3 సినిమాలు ఇవే..ఎంత స్పెషల్ అంటే..!!

మాస్ మహారాజ రవితేజ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు.. డైరెక్టర్ అవుదామని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారి మాస్ మహారాజా గా అదిరిపోయే క్రేజ్ అందుకున్నాడు. ఇప్పటికే రవితేజ తన కెరీర్లో 70 కి పైగా సినిమాల్లో నటిస్తే వాటిలో చాల సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. ఇలాంటి రవితేజ తన కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 3 సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

వాల్తేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. రవితేజ పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ అయినప్పటికీ ఈ మూవీ విజయంలో మాత్రం రవితేజ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని రూ.230 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రవితేజ కు జోడిగా కేథరిన్ నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ధమాకా : మాస్ మహారాజ రవితేజ హీరో గా వ‌చ్చిన ఈ సినిమాలో ప్ర‌స్తుత టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా .. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు. ఈ మూవీబాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని రూ.85 కోట్ల కలెక్షన్ లని వసూలు చేసింది.

క్రాక్ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాడు. ఈ మూవీ లో సముద్ర ఖని … వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రలలో నటించగా … సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీబాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక సినిమా రూ. 70 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూడు సినిమాలు రవితేజ కెరీర్ లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఆయన కెరియర్ లోనే ఆయన చేసిన సినిమాలలో టాప్ 3 సినిమాలు లిస్టులో చోటు దక్కించుకున్నాయి.