నాగశౌర్య హీరోగా.. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రంగబలి. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది. యుక్తి ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల్లో ఆమె అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాపై నాగశౌర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు.
ఎస్. ఎల్. వి మూవీస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ లో ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ కానుంది.
ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ యుక్తి తరేజ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు పవన్ ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ చేయగా నేను ఫస్ట్ లుక్ టెస్ట్ జరిగిందని.. అందులో సెలెక్ట్ అయిన తర్వాత రెండు సన్నివేశాలు ఇచ్చి వాటిలో నటించమన్నారని.. ఆ పాత్రకు నేను సరిపోతానని నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేసారంటు తెలిపింది.
నా మొదటి సినిమాలోనే నాగశౌర్య లాంటి మంచి హీరోతో పాటు పేరున్న నిర్మాణ సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ సినిమా నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది యుక్తి . అలాగే తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరు అనే అంశంపై మాట్లాడుతూ అల్లు అర్జున్ అంటే తనకు పిచ్చని.. ఆయన డ్యాన్స్ ఆమెకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్తో డ్యాన్స్ స్టెప్స్ మ్యాచ్ చేయడం సాధ్యం కాదని.. కాని నాకు ఆయనతో ఒక్కసారైనా డ్యాన్స్ చేయాలని కోరికైతే ఉందని బయట పెట్టింది. హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఆమెకు ఫేవరెట్ హీరోయిన్ అట. ఇక ఈ సినిమా యుక్తి తరేజాకి మంచి గుర్తింపు తీసుకు వస్తుందో లేదో చూడాలి.