రమాప్రభ టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ యాక్ట్రెస్‌గా ఒక వెలుగు వెలిగింది. ఇటీవల శరత్ బాబు మరణంతో ఆమె పేరు ఎక్కువుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆమె కంటే వయసులో చిన్నవాడైన శరత్ బాబుతో వివాహం చేసుకున్న రమాప్రభ ఏవో మనస్పర్ధలు కారణంగా అతనికి విడాకులు ఇచ్చేసింది. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇటీవల రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
రమాప్రభ మాట్లాడుతూ మూడు నెలల నుంచి నేను చిన్న చిన్న టూర్లు వేసుకుంటూ వస్తున్నానని… హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, షిర్డీ వెళ్లి వచ్చానని రమాప్రభ చెప్పుకొచ్చింది. కొంతకాలం నుంచి జరిగిన కొన్ని సంఘటనలు తలుచుకుంటే నాకు జాలి వస్తుందని… ఒక్కొక్కసారి నవ్వొస్తుందని చెప్పింది. ఇటీవల నేను ఏదోలా పాపులర్ అవుతూనే ఉన్నాను.. ఏదో ఒక విషయంపై నా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.. కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుందని రమాప్రభ కామెంట్ చేసింది.
చెన్నైలో తనకు ఒక ఇల్లు ఉందని.. ఆ ఇంట్లో చాలామంది ఉంటున్నా… ఆ ఇల్లు నా ఇల్లు కాదని… మరొకరి ఇల్లని చెప్పుకుంటున్నారని.. ఆ మాటలు విన్నప్పుడు తనకు నవ్వు వస్తుందని చెప్పుకొచ్చింది రమాప్రభ. నాకు రజనీకాంత్ డబ్బులు ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయని… ఆ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది. 13 సంవత్సరాల నుంచి నేను ఆర్టిస్ట్ గా పని చేస్తూ ఎంతో కొంత కూడబెడుతూనే ఉన్నాను.. ఇప్పుడు కొంతమంది నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసి సంపాదించుకుంటున్నారని ఆమె వాపోయింది.
ఈ వార్తల్లో నిజం లేదని కూడా రమాప్రభ తెలిపింది. దీన్ని బట్టి శరత్ బాబు – రమాప్రభల గురించి వచ్చిన వార్తల్లో చాలావరకు అబద్ధాలే ఉన్నాయని రమాప్రభ పరోక్షంగా చెప్పినట్లయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో శరత్ బాబు చనిపోవడంతో రమాప్రకు కూడా ఎంతోకొంత బాధ ఉన్నట్టుగా ఉందని కొందరు చర్చించుకుంటున్నారు.