మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్ లోనే ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాల్లో రంగస్థలం కూడా ఒకటి. చరణ్ లోని గొప్ప నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ఆది పిలిశెట్టి, అనసూయ, వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి భారీ కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షలను సొంతంచేసుకుని రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రామ్ చరణ్ చెవిటి వాడిగా చిట్టి బాబు పాత్రలో తనదైన నటనతో అదరగొట్టారు. ఈ సినిమాతో రామ్ చరణ్ కు భారీ పాపులారిటీ కూడా వచ్చింది.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే రంగస్థలం సినిమా చిరంజీవి నటించిన ఓ పాత సినిమాకు కాపీ అనే విషయం మీకు తెలుసా..? అవును మీరు వింటున్నది నిజమే.
ధవళ సత్యం దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన “జాతర” సినిమాలో చిరుకు జంటగా ఇంద్రాణి హీరోయిన్ గా నటిస్తే, శ్రీధర్, నాగభూషణం, జయలక్ష్మి వంటి తదితర అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. 1980లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే ఇదే సమయంలో రామ్‌చరణ్ నటించిన రంగస్థలం సినిమామా కూడా అచ్చం చిరంజీవి జాతర సినిమా లాగానే ఉంటుంది.. ఈ రెండు సినిమాల కథలు పాత్రలు దాదాపు ఒకేలా ఉంటాయి.
జాతర సినిమాలో చిరంజీవి అన్నగా శ్రీధర్ నటించిగా అతని పాత్ర కూడా మధ్యలో చనిపోతుంది. అదేవిధంగా ఈ సినిమాలో ప్రెసిడెంట్ పాత్ర కూడా పేద ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ, వారిని ఇబ్బంది పెడితు ఉంటుంది. ఇక చివరకు ఊరు ప్రజలు అంతా ప్రెసిడెంట్‌ని తరిమికొట్టడం వంటి సన్నివేశాలు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో చూసిన మాదిరిగా ఉంటుంది. ఇక ఇదే విషయంపై గతంలో డైరెక్టర్ ధవళ సత్యం కూడా స్పందించారు.. నేను తెరకెక్కించిన జాతర సినిమా కథను ఇన్స్పిరేషన్ గా తీసుకుని రంగస్థలం సినిమా చేశారని ఆయన అప్పట్లో అభిప్రాయపడ్డారు.