రామ్ చరణ్ కి పాప పుట్టిన 24 గంటల్లోనే అల్లుడు కన్ఫామ్..మెగా అభిమానులా మజాకా..!

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలంలో అప్పుడప్పుడు కొన్ని వింత వింత పనులు, పోస్ట్‌లు చేస్తూ చిత్ర పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలకే షాక్‌లు ఇస్తూ ఉన్నారు నెటిజన్లు. ఇదే క్రమంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఓ పన్నంటి పాప పుట్టిపుట్టగానే ఆ పాపకి కాబోయే భర్తను కూడా ఇప్పుడే కన్ఫామ్ చేసేసారు. ఇందులో మెగా అభిమానులు అత్యుత్సాహం ఎక్కువగానే కనిపిస్తుంది.

From Chiranjeevi to Allu Arjun, a 'Mega' moment captured on Diwali |  Entertainment Gallery News,The Indian Express

అందరికీ తెలిసిన విషయమేమైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు నిన్న తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు మెగా కుటుంబంలో మూడోతరం వారసురాలు అడుగు పెట్టింది. ఇక ఇదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ అపోలో హాస్పటల్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి కూడా తన మనవరాలి గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్- ఉపాసనలకు సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ఈ సమయంలోనే ఈ మెగా మనవరాలుకి కాబోయే భర్త అల్లు వారి అబ్బాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు మెగా అభిమానులు. దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ కూడా గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక నిన్న ఉపాసనకు డెలివరీ అయిన కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఆస్పత్రికి వెళ్ళి మరి మేనకోడలను ఆశీర్వదించాడు.

Ram Charan's wife Upasana to Allu Arjun's better half Sneha: 4 Beautiful  star wives of South Indian actors | PINKVILLA

ఇక అప్పటినుంచి అల్లు అర్జున్ కొడుకు అయాన్ కి రామ్ చరణ్ పాప మరదలు అవుతుంది. ఇక అల్లు అర్జున్ కూడా ఇప్పటినుంచే తన మేనకోడలను దగ్గర చేసుకోవడానికి గట్టి ప్లాన్ లో ఉన్నాడని కొంతమంది పోస్ట్‌లు పెట్టుతూ సోషల్ మీడియాలో షేర్‌లు చేస్తున్నారు. అంతేకాకుండా మరి కొంతమంది ఏమో ఈ బంధుత్వాన్ని ఇంకా పెంచుకోండి అల్లు అర్జున్ కొడుకుని రామ్ చరణ్ అల్లుడుగా చేసుకోండి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రామ్ చరణ్ కి బిడ్డ పుట్టిన 24 గంటలు కాకముందే అల్లుడిని కూడా కన్ఫర్మ్ చేశారు ఇదెక్కడి విచిత్రమైన అభిమానం రా బాబు అంటూ మరి కొందరు నవ్వుకుంటున్నారు.