ఆ స్టార్ హీరోతో రామ్‌చ‌ర‌ణ్ బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్‌… అబ్బా ఫ్యూజులు ఎగిరే అప్‌డేట్‌..!

ఇటీవ‌ల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ లో నటించడం మనం చూస్తూనే ఉన్నాం. అది కూడా భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీ హీరోలు కూడా మరో ఇండస్ట్రీ హీరోలతో కలిసి గెస్ట్ రోల్ లో నటిస్తూ వారి సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. అందుకు అనుగుణంగా దర్శకులు కూడా భాషతో సంబంధం లేకుండా అందరూ హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి సై అంటున్నారు.

ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలో ఆయనతో కలిసి పాటలో చిందేసి అందరినీ థ్రిల్ చేశాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి – త్రిష హీరో హీరోయిన్లుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాలో ఉన్నట్టు కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన గ‌త‌ సినిమా విక్రమ్ లో కూడా కమలహాసన్ తో పాటు క్లైమాక్స్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌ను కూడా తీసుకున్నాడు. ఇప్పుడు లియో సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఎవ్వ‌రూ ఊహించిన గెస్ట్ రోల్‌లో నటించబోతున్నాడని తెలుస్తుంది. అది కూడా విలన్ రోల్ కి దగ్గరగా ఉంటుందట. రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ఈ సినిమా చివర్లో రివిల్ అవుతుందని అంటున్నారు.

ఈ వార్త మాత్రం నిజమైతే లియో మూవీ మరో లెవల్ లో అరాచకం సృష్టిస్తుంద‌నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పుడు ఖ‌చ్చితంగా లియో సినిమాకు తెలుగులో మామూలు బ‌జ్ ఉండ‌దు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే.