మెగా వారసురాలి పేరు ఏమిటో తెలుసా.. మనవరాలి పేరును చెప్పేసిన మెగాస్టార్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రీసెంట్ గానే పండంటి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. గత 11 సంవత్సరాలుగా మెగా కుటుంబం, మెగా అభిమానుల కల‌ నెరవేరింది. ఈనెల 20వ తేదీన ఉపాసన అపోలో హాస్పటల్లో మెగా కుటుంబానికి వారసురాలను ఇచ్చింది. ఈరోజు రామ్ చరణ్- ఉపాసన కూతురికి బారసాల వేడుక ఎంతో ఘనంగా జరిపించారు.

ఇక ఈ వెడుక‌ల‌ ఏర్పాటల‌కు సంబంధించిన వీడియోని కూడా ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన డార్లింగ్ కు ఈరోజు పేరు పెట్టబోతున్నట్లు ఉపాసన అనౌన్స్ చేసింది. ఈ బుల్లి మెగా వారసురాల బార‌సాల వేడుక‌లో కొణిదెల, కామినేని ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేసింది. ఇక తాజాగా చిరంజీవి తన మనవరాలి పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

మా ఇంటి మహాలక్ష్మి పేరు ‘క్లీంకార కొణిదెల'(Klin Kara Konidela) అంటూ పోస్ట్ చేశాడు. అదేవిధంగా ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను కూడా చిరు ఆ పోస్టులో పోస్ట్ చేస్తూ మనవరాలి పేరును తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలో చిరంజీవి దంపతులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.