మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ ఒక సంచలన నిర్ణయంతీసుకున్నాడట. ఇక అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
పెళ్లి అయిన పది సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులుగా మారబోతున్న రామ్ చరణ్ – ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ అని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఆమె బేబీ బంప్ కు సంబంధించిన చాలా ఫొటోస్ అలాగే చెర్రీ – ఉపాసనల ట్రిప్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉపాసన తొమ్మిదో నెల గర్భవతిగా ఉంది.
జులై మొదటి వారంలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ డెలివరీ డేట్ తో సహా ఇప్పటికే సోషల్ మీడియాలో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈ క్రమంలో రామ్ చరణ్ తన భార్య, పుట్టబోయే బిడ్డ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడట. ఇంతకీ ఏంటా నిర్ణయం..? అనుకుంటున్నారా. ప్రస్తుతం ఉపాసన డెలివరీ టైం దగ్గర పడడంతో ఉపాసన డెలివరీ అయ్యేంత వరకు అన్ని షూటింగ్ పనులకి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట చెర్రి.
ఉపాసన బాగోగులను చూసుకోవడం కోసం ఆమె అవసరాలను దగ్గర ఉండి చూసుకోవడం కోసమే.. రామ్ చరణ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఉపాసనకు బేబీ పుట్టిన కొంతకాలం వరకు రామ్ చరణ్ తిరిగి ఎటువంటి షూటింగ్ లోను పాల్గొనే ప్రసక్తే లేదట. అయితే గేమ్స్ చేంజర్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.. కానీ మిగతా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా టైం పడుతుందని దినిబట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ మంచి నిర్ణయం తీసుకున్నావ్ చెర్రీ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!