చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి హిట్ అందుకోవటం చాలా కామన్ గా జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తాడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్ ప్రస్తుతం తండ్రిగా ప్రమోట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు.
ఒక ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే సమయంలో రామ్ చరణ్ ఛీ ఇదేం కథ అంటూ రిజెక్ట్ చేసిన కథతోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే.. డార్లింగ్.. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాల్లో ప్రభాస్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటించింది. అలాగే శ్రద్ధాదాస్, ప్రభు, ఎం.ఎస్ నారాయణ, ముకేష్ రిషి, చంద్రమోహన్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించాడు.
ఇక టాలీవుడ్ సీనియర్ నిర్మాత బివిఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. రూ.18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డార్లింగ్ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను కన్నడ, ఉర్దూ భాషలో కూడా రీమిక్ చేశారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే డార్లింగ్ సినిమాకి మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదట.
ముందుగా దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమా కథను రామ్‌చరణ్ కు చెప్పారట. అయితే స్టోరీ రామ్ చరణ్ ను పెద్దగా మెప్పించలేకపోయింది. దాంతో సినిమాను రిజెక్ట్ చేశారట. ఇక తర్వాత అదే కథను ప్రభాస్‌కు వినిపించక ఆయనకు నచ్చడంతో రామ్ చరణ్ హీరోగా రావాల్సిన డార్లింగ్ సినిమా ప్రభాస్ హీరోగా వచ్చి ఆయన కెరీర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీగా నిలిచిపోయింది.