టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఒకవైపు రాజకీయాలు , మరొకవైపు ప్రజాసేవ సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ తన కెరీర్ లో కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ జాబితాలో రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.
మగధీర చిత్రం రామ్ చరణ్ కెరియర్లో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు .ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించింది.ఈ చిత్రానికి నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరించారు. 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. నిర్మాత అల్లు అరవింద్ కు కూడా కాసుల వర్షాన్ని కురిపించిన ఈ చిత్రం ఏకంగా అప్పట్లో రూ .75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
తెలుగులో అప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంలో మొదటి స్థానంలో నిలిచింది మగధీర. ఇక కొన్ని థియేటర్లలో ఈ సినిమా వెయ్యి రోజులు కూడా ఆడింది.. అయితే మొదట ఈ సినిమా కథను రాజమౌళి బాలయ్యకు వినిపించి బాలయ్యతో ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారట. ఈ నేపథ్యంలోనే బాలయ్య వద్దకు వెళ్లి రాజమౌళి మగధీర సినిమా కథ కూడా వినిపించారట. అయితే ఆ స్టోరీ బాలయ్యకు బాగానే నచ్చినప్పటికీ కొన్ని కారణాల చేత ఈ సినిమాను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
అలా తిరస్కరించిన వెంటనే రాజమౌళి మగధీర సినిమా కథ రామ్ చరణ్ కు వినిపించగా ఓకే చెప్పడంతో రామ్ చరణ్‌తో తెరకెక్కించారు. ఈ విషయాన్ని బాలయ్య తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో టైంలో అక్కడ టీంకు స్వయంగా చెప్పాడట. ఒక వేళ బాలయ్య మగధీర సినిమాను చేసి ఉంటే ఈ సినిమా బాలయ్య కెరియర్ లో కూడా ఒక మైలురాయిగా నిలిచేదేమో అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు.