ఎన్టీఆర్ ఆ హీరో కాంబోలో రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌… RRR అమ్మ మొగుడు లాంటి సినిమా..!

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ రాకుండానే రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి గాసిప్స్ మొదలవుతూ ఉంటాయి. షూటింగ్ కి రెండు సంవత్సరాల టైం ఇతర టెక్నికల్ పనులు కలుపుకొని మరో ఏడాది చేసిన చేస్తారు అయితే ఎంత లేట్ అయినా సరే రాజ‌మౌళి ఎంట్రీ మాత్రం ఎంతో హుందాగా ఉంటుంది.

త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు తిరగ రాసిన తర్వాత రాజమౌళి తర్వాత పాన్ వరల్డ్ మూవీ తీసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. ఈసారి రాజమౌళి తన సినిమాలో హీరోగా మహేష్ బాబును తీసుకున్నాడు. ఇప్పటికే మహేష్- రాజమౌళి సినిమాపై ఎన్నో వార్తలు బయటికి వస్తూనేఉన్నాయి. రీసెంట్ గానే మహేష్ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్న వీడియో చూసి జక్కన్న సినిమా కోసం అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

చాక్లెట్ బాయ్‌లా ఉండే మహేష్ బాబుని జక్కన్న ఏ రేంజ్ లో చూపిస్తారు అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి – మ‌హేష్‌ కాంబోలో వస్తున్న సినిమా ఆఫ్రికన్ అడ‌వుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎక్కువగా హాలీవుడ్ టెక్నికల్ టీం తోనే రాజమౌళి పనిచేయబోతున్నాడట. ఈ సినిమాలో నటించే వారిని కూడా ఎక్కువగా హాలీవుడ్ నుంచే తీసుకొస్తున్నారని కూడా తెలుస్తుంది.

ఈ అడ్వెంచర్ మూవీ తర్వాత రాజమౌళి ప్రభాస్- ఎన్టీఆర్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరితో చేయబోయే సినిమా గురించి ఓ లైన్ ని కూడా అనుకున్నారట. ఆఫ్ స్క్రీన్ లో ఈ ఇద్దరిలోను రాజమౌళికి మంచి బాండింగ్ ఉంది. సో, ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించిన అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. రాజ‌మౌళి ఇద్ద‌రితో సినిమా చేస్తే అది ఖ‌చ్చితంగా త్రిబుల్ ఆర్‌కు అమ్మ మొగుడు లాంటి సినిమా అవుతుంద‌ని నెట్టింట అప్పుడే చ‌ర్చ స్టార్ట్ అయ్యింది.