సినిమా ఇండస్ట్రీలో బాలయ్యకు ఏ స్థాయిలోక్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య కోరితే ఆయనతో పని చేయడానికి ఏ డైరెక్టర్ అయినా సిద్ధంగా ఉంటారు. అయితే బాలయ్య రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో అయినా పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా రాజమౌళి నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు రాజమౌళి బాలయ్యకు వీరాభిమాని అయినా బాలయ్యకు మాత్రం జక్కన్న ఛాన్స్ ఇవ్వడం లేదు.
అయితే ఇందుకు సంబంధించి రాజమౌళి కారణాలు రాజమౌళికి ఉన్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళికి క్రేజ్ ఉంది. రాజమౌళి మార్కెట్ భారీ స్థాయిలోపెరుగుతోంది. బాలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్నా ఇతర భాషల్లో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. బాలయ్యకు సినిమాలో కీలక పాత్ర ఇచ్చి మెయిన్ రోల్ మరో హీరోకు ఇస్తే బాలయ్య ఫ్యాన్స్ నుంచి జక్కన్నపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బాలయ్య మార్కెట్ మహా అంటే 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. బాలయ్యతో రాజమౌళి సినిమా తీయాలని భావించినా పాన్ వరల్డ్ స్థాయిలో ఆ సినిమాను సక్సెస్ చేయడం తేలిక కాదు. యంగ్ జనరేషన్ స్టార్స్ ను అభిమానించిన స్థాయిలో సీనియర్ స్టార్స్ ను ఇతర భాషల ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పలేమనే సంగతి తెలిసిందే. ఈ రీజన్ వల్లే ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదని తెలుస్తోంది.
బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి, బాబీ సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో తెరకెక్కుతున్నాయని బోగట్టా. బాలయ్య సినిమాలు మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటున్నాయి. వరుస విజయాలతో బాలయ్య సీనియర్ స్టార్స్ లో నంబర్ వన్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.