అమ‌ల‌ను నాగార్జున కంటే ముందే ఆ న‌టి భ‌ర్త కూడా పిచ్చిగా ప్రేమించాడా..!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన్మధుడుగా టాలీవుడ్ లోనే ఆగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున వ్యక్తిగ‌త‌ జీవితం గురించి అందరికి తెలిసిందే. ఈయన ముందుగా దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకుని నాగచైతన్య పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత మరో హీరోయిన్ అమలను ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే అమల పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక తన జీవితాన్ని మొత్తం నాగార్జున కుటుంబానికే పరిమితం చేస్తూ ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఇదే సమయంలో అమల సినిమాలో నటిస్తున్న స‌మ‌యంలో మరో నటుడు ఈమెను ఎంతో గాఢంగా ప్రేమించాడట. అయితే ఈ విషయం ఆమెకు తెలియదు. ఆమెకు చెప్పే ధైర్యం లేక చెప్పలేకపోయాడు.

అమలకు చెప్పకుండానే వన్ సైడ్ లవర్ గా చాలాకాలం ప్రేమిస్తూ వచ్చాడు. అలా ప్రేమించిన ఆ నటుడు మరెవరో కాదు. ఒకప్పుడు స్టార్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న రఘువనన్‌. అక్కినేని నాగార్జున కంటే ముందే అమలను ఎంతో ప్రాణంగా ప్రేమించాడట. కానీ అమలకు చెప్పలేకపోయాడు. ఆ తర్వాత అమల నాగార్జున‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుటుంద‌న్న విష‌యం తెలుసుకుని ఆమెకు దూరంగా ఉన్నాడు.

అలా అమలతో తన ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై సినిమాలో నటించకుండా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని పిచ్చోడు అయిపోయాడ‌ని కూడా అంటారు. ఆ త‌ర్వాత ర‌ఘువ‌ర‌న్ ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్‌ నటి, ఫేమ‌స్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ రోహిణిని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పటికి రోహిణిని సినిమాల్లో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా కొనసాగుతుంది.