టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి – కనికా థిల్లాస్ 2014లో ప్రేమించుకుని ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. 2016 నుంచి వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. 2019లో వచ్చిన ” జడ్జిమెంటల్ హై క్యా ” అనే సినిమాలో కలిసి పనిచేశారు. ప్రకాష్ డైరెక్టర్గా పని చేయగా కనికా స్టోరి హెల్పర్ గా వర్క్ చేసింది.
ఆ టైంలోనే ఓ సారి ఆమె అనారోగ్యంతో హాస్పటల్లో ఉన్నప్పుడు సూర్యప్రకాష్ తీసుకున్న కేర్ చూసే అతడి ప్రేమలో పడి పెళ్లాడింది. ఆ తర్వాత కొంత కాలానికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. కనికా తరువాత కొంతకాలానికి స్క్రీన్ రైటర్ హిమాన్షుతో ప్రేమలో పడి 2021లో అతడిని వివాహం చేసుకుంది. ఇక రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ విషయానికి వస్తే అతడు డైరెక్టర్గా తెరకెక్కించిన ” అనగనగా ఓ ధీరుడు ” ఫాంటసీ చిత్రం డిజాస్టర్. తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో చేసిన జీరో సైజ్ కూడా అతడికి పెద్దగా కలిసి రాలేదు.
విడాకుల తర్వాత కనికా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రచయితగా మారింది. గతేడాది రిలీజైన ఏక్ విలన్ రిటర్న్స్, రక్షాబంధన్ సినిమాలకు రైటక్ గా పనిచేసింది. తాజాగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న ” డుంకి ” సినిమాకు కూడా కనికనే కథ అందించింది. రైటర్ గా సక్సెస్ సాధించిన కనిక ప్రస్తుతం కథా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి నిర్మాతగా మారింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కథా పిక్చర్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినందుకు నేను ఎంతగానో ఆనందపడుతున్నానని.. కాజల్, కృతిసనన్ లాంటి టాలెంలెడ్ హీరోయిన్స్ తో కలిసి నేను వర్క్ చేయడం సంతోషాన్ని కలిగిస్తుందని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.