పుష్ప 2 నుంచి భారీ యాక్షన్ సీన్ లీక్.. బ‌న్నీ చంపేశాడు మామ… (వీడియో)

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇండస్ట్రీలో ఉన్న ఎందరో స్టార్ సెలబ్రెటీలపై ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడమే కాకుండా.. వేల కోట్లు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలను థియేటర్లో రిలీజ్ అవ్వకముందే షూటింగ్లో చేసే సన్నివేశాలను సోషల్ మీడియాలో లీక్ అయిపోవడంతో చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ లీక్ అవ్వడంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఈ లీక్ ల బెడద హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా తొలి భాగం ప్రేక్షకులు ముందుకు వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప2 సినిమా షూటింగ్లో అల్లు అర్జున్ తో పాటు ఈ చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

ఇప్పటికే బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఆ టీజర్ లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించడం సినిమాకి హైలైట్ గా మారిబోతుందంటూ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది.

ఇక ఆ వీడియోలో ఎర్రచందనంతో ఉన్న నాలుగు లారీలు నదిలో దూసుకుపోతూ ఉంటాయి… వాటిని రెండు పోలీస్ జీప్‌లు వెంబ‌డిస్తూ ఉంటాయి. ఈ సీన్ అవుట్డోర్ షూటింగ్ కావడంతో కొందరు అభిమానులు ఆ సన్నివేశాన్ని మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సీన్ రేపు థియేట‌ర్ల‌లో చూస్తుంటే బ‌న్నీ ఫ్యాన్స్‌కే కాదు.. అంద‌రికి గూస్ బంప్స్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఎప్పుడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.