పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ ప్రాజెక్టుకే ‘. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా కీలక పాత్రను పోషిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్, ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొనే, దిశా పటాని ఈ సినిమాలో కీరోల్ ప్లే చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌తో ప్రాజెక్ట్ కే సినిమా రూపొందుతుంది.
యూఎస్‌లో జరిగే సాన్డిగో కామిక్ కన్ ఈవెంట్‌లో అడుగుపెట్టబోతున తొలి భారతీయ సినిమా ప్రాజెక్టు కే. అవడం విశేషం. జూలై 19న ఈ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే అఫీషియల్ టైటిల్, టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్టుపై మూడు, నాలుగు టైటిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రాజెక్టు కే లో కే ఇదేనంటూ కొంతమంది ట్విట్ చేస్తున్నారు.
ఇక మేకర్స్ అయితే ఫైనల్‌గా రెండు టైటిల్స్‌ని మూవీ టీం అనుకుంటున్నారని సమాచారం. వాటిలో ఒక టైటిల్ కచ్చితంగా జులై 19న జరిగే ఈవెంట్లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ టైటిల్స్ ఏంటంటే ‘ కాలచక్ర ‘ ఇది పురాణాల నుంచి తీసుకున్న పదం. కాలచక్రం అంటే సృష్టి, వినాశనం. భగవద్గీతలో ఈ విషయం గురించి శ్రీకృష్ణుడు డీటెయిల్ గా వివరించాడు.
ఇక మరో టైటిల్ ‘ కురుక్షేత్ర ‘ ఇది కూడా మహాభారతం నుంచి తీసుకున్న పదమే. కురుక్షేత్ర అంటే మహాభారతంలో యుద్ధం జరిగిన ప్రదేశం. ఈ టైటిల్‌ని కూడా మేకర్స్ పరిగణలోకి తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రెండిట్లో దేన్నీ అఫీషియల్‌గా ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. కాలచక్ర టైటిల్‌కే ఎక్కువగా మక్కువ చూపుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.హెచ్. అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని అంటున్నారు.