చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం.. బయటకు ఎంతో అందంగా కనిపించే ఈ రంగుల ప్రపంచంలో ఎవరికీ తెలియని ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మగవారి డామినేషన్ ఉండే పరిశ్రమలో హీరోయిన్లు ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. ఇక అన్ని రంగాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా వేధింపులు ఉంటాయి. చాలామంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ భారిన పడిన వారే. దర్శక నిర్మాతల చేతిలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నవారే.
ఈ నేపథ్యంలోని ఇండస్ట్రీలో తాను కూడా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాని వాపోతోంది ప్రముఖ నటి ప్రగతి. అమ్మగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ టాలీవుడ్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె కూడా ఓ సినిమా షూటింగ్లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఓ టాలీవుడ్ స్టార్ కమెడియన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
ఇండస్ట్రీలో ఆయన ఒక అగ్ర కమెడియన్.. ఆయన షూటింగ్ సెట్లో నాతో చాలా బాగా మాట్లాడుతారు. ఎంతో పద్ధతిగా కూడా ఉంటారు. అయితే ఆయన ఒక రోజు ఎంతో అసభ్యంగా ప్రవర్తించారు.. దానిని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను.. ఆరోజు నాకు ఎవరితోనో మాట్లాడాలనిపించలేదు… ఏ పని చేయాలనిపించలేదు..చివరకు భోజనం తినడానికి కూడా నా మనసు సహకరించలేదని నాటి సంఘటన గుర్తు చేసుకుంది.
షూటింగ్ అయ్యి వెళ్లిపోతున్న టైంలో ఆయనను కేరోవేన్లోకి తీసుకెళ్లి మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా ? మిమ్మలను అక్కడే నిలదీసి ఉంటే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించానని.. మీరు కాబట్టే నేను సైలెంట్‌గా ఉండిపోయానని గట్టిగా చెప్పినట్టు తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు ప్రగతి.
ఆమె పట్ల మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్ పేరు మాత్రం ఆమె రివీల్ చేయలేదు. కాగా గతేడాది డీజే టిల్లు, రంగరంగ వైభవంగా, పెళ్లి సందడి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.