మ‌ళ్లీ తెరపైకి ప్రభాస్ – షర్మిల మ్యాట‌ర్‌… ప్ర‌భాస్ కొడుకంటూ పుకార్లు… సిగ్గులేదా…!

సినిమా వాళ్లంటే అందరికీ ఓ గురి ఉంటుంది. నేటి యువతకు వారిని గురించి మాట్లాడుకోవడానికి మించిన టైం పాస్ మరొకటుండదు. నా హీరో తోపంటే నా హీరో తోపని వాదించుకుంటూ వుంటారు. దాంతో పలు మీడియాలు వీరి గురించిన వార్తలు అదే పనిగా వేస్తూ ఉంటాయి. అందులోను గాసిప్స్ గురించి చర్చించే మీడియాలే మనకు ఎక్కువగా కనబడతాయి. ఇక అవి చాలవన్నట్టు నేడు సోషల్ మీడియా రాజ్యమేలుతున్నవేళ గాసిప్స్ సహజంగానే చక్కెర్లు కొడుతున్న పరిస్థితి.

కొన్నాళ్ల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ – షర్మిల మధ్య అఫైర్ నడుస్తుందంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు దుమారాన్ని రేపిన సంగతి విదితమే. ఇక సెలబ్రిటీల మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందన్నట్లు మీడియాలో ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. సినిమా వాళ్లకు బయట వ్యక్తులతో రిలేషన్ ఉన్నట్లు కొందరు ఫేక్ వార్తలను సృష్టించి సొమ్ముచేసుకుంటూ వుంటారు.

అయితే ఇలాంటి అబద్ధాల వలన చాలామంది గౌరవానికి భంగం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి నిరాధార రూమర్ల వల్ల బాగా సఫర్ అయిన వారిలో వైఎస్ షర్మిల – ప్రభాస్ ముందు వరుసలో వుంటారు. అయితే కొన్నాళ్ల తరువాత ఆ ఫేక్ న్యూస్ అందరూ మర్చిపోయారు. అయితే చాలాకాలం తరువాత మరలా వీటిగురించి ఓ రూమర్ తాజాగా సోషల్ మీడియాలో షికారు చేయడం గమనార్హం.

రీసెంట్‌గా షర్మిల తన కొడుకుతో కలిసి ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో కొందరు అతగాడిని హీరోలాగా ఉన్నాడంటూ పొగిడినా, మరికొంతమంది షర్మిల కుమారుడు ప్రభాస్ లాగా ఉన్నాడేంటి? అంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. నిజం కంటే అబద్దమే త్వరగా ట్రావెల్ చేస్తుంది అన్న నానుడి తెలిసిందే.

అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అని తెలుసుకోకుండా ఆ విషయాన్ని చాలామంది ఇతరులతో షేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గౌరవంగా బతుకుతున్న షర్మిలకు ప్రభాస్‌తో సంబంధం అంటగట్టినా వారిని గతంలో పోలీసులు పట్టుకొని మందలించారు కూడా. మరి అప్పుడిచ్చిన డోస్ సరిపోలేదేమో… కొత్తగా మరో విషయాన్ని లేవనెత్తుతున్నారని ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.