ప్రభాస్ ‘ సలార్ ‘ స్టోరీ లీక్.. ఆ దేశంతో పెద్ద యుద్ధం… వింటేనే రొమాలు లేస్తున్నాయ్‌…!

కేజీఎఫ్ సీరిస్‌ సినిమాల‌తో బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచనాలు క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా సలార్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రశాంత్ నీల్‌ హోమ్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పవర్ఫుల్ ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ తో రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేస్తోంది. మరోసారి ప్రభాస్ పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. స‌లార్‌కు, కేజిఎఫ్ సినిమాల‌కు లింక్ అయి ఉంటుందట‌.. అందుకే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వ‌స్తుందంటున్నారు. ఇక ఎప్పుడు ? సలార్ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం కేజిఎఫ్‌లో చూపించినట్టు గోల్డ్ మైనింగ్ మాఫియా లాగానే ఈ సినిమాలో కూడా సున్నపు రాయి మైనింగ్ మాఫియా నేపథ్యం.. అమెరికన్ ఆర్మీతో కనెక్ట్ అయి ఉంటుందట. ప్రభాస్- అమెరికా ఆర్మీతో చేసే పోరాట సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇటలీలో చిత్రీకరించారని.. అలాగే స్టోరీ లైన్ లో కొన్ని ఎలిమెంట్స్ కేజీఎఫ్ చాప్టర్ 2కు లింక్ ఉంటాయని తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ సిరీస్‌లను కలిపి ఒక సీక్వెల్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ ఫస్ట్ పార్టుకు, కేజీఎఫ్ 2 లింక్‌ స్పష్టంగా ఉంటుందని, టాక్ నడుస్తుంది. మరీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.