పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్. రీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ 2 లాంటి హిట్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ అవడంతో ప్రేక్షకుల్లో సలార్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ సాధించింది. రు.500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్లు వరుసగా వస్తున్నాయి. సినిమా ఫస్ట్ సింగిల్ న్యూస్ ఒకటి కాగా… మొదటి సాంగ్ పై లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది.
సలార్ 1 ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు రవి బ్రసూర్ టీం సలార్ మొదటి సాంగ్ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మ్యూజికల్ అప్డేట్ రావచ్చట. ఈ సినిమా పాటలపై కూడా కేజిఎఫ్ ను మించిన గ్రాండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వరుసగా సలార్ అప్‌డేట్లతో ప్రభాస్ ఫ్యాన్స్‌ను మనం ఆపలేమనే చెప్పాలి.