యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల పరంపరలో ఆదిపురుష్ లైన్లో ఉన్న కారణంగా ఇన్నాళ్లూ సలార్ అప్ డేట్స్ ఇవ్వలేదు మేకర్స్. ఇప్పుడు ఆదిపురుష్ థియేటర్లలోకి వచ్చి థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి చేసుకోబోతోంది. ఆదిపురుష్ అంచనాలు అయితే అందుకోలేదు. ఈ సినిమా బడ్జెట్‌కు వచ్చిన అమౌంట్‌కు చూస్తే భారీ లాస్. సో ప్రభాస్ ఖాతాలో వరుసగా మూడో ప్లాప్ వచ్చి చేరింది.
ఇక ఇప్పుడు అందరి ఆశలు సలార్ సినిమా మీదే ఉన్నాయి. కేజీయఫ్ సీరిస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో నేషనల్ వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు సలార్ యూనిట్ వరుసగా అప్ డేట్స్ తో సిద్ధమైంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ లాక్ చేసి పెట్టింది. అయితే టీజర్ రిలీజ్ డేట్ విషయంలో ఎంచుకున్న సెంటిమెంట్ ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది.
సలార్ టీజర్ ను జులై 6వ తేదీన ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. మామూలుగా పెద్ద హీరోల సినిమాల టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేసేటప్పుడు రాత్రి లేదా సాయంత్రం చేస్తారు. కానీ సలార్ టీజర్‌ను పొద్దు పొద్దున్నే రిలీజ్ చేస్తున్నారు. ఇదో కొత్త సెంటిమెంట్‌గా మారింది. ముహూర్తం ప్రకారమే సలార్ టీజర్‌ను ఉదయం రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత వరుస ప్లాపులతో ఉన్న ప్రభాస్ కెరీర్‌ను నిలబెట్టే సినిమా ఇదే అంటున్నారు. ప్రభాస్‌ను మరోసారి పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చే సినిమా అయితే ఖచ్చితంగా ఇదే అంటున్నారు. ప్రభాస్ సలార్ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తుండగా… సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వస్తోంది.