ప్ర‌భాస్ – వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్తో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రభాస్ సెప్టెంబర్లో మరో భారీ పాన్ ఇండియా సినిమా సలార్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో అంబాసిడర్ సినిమా కూడా ప్రభాస్ లైన‌ప్‌లో ఉంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ క్రేజీ లైన‌ప్‌లో ఇప్పుడు మరో అదిరిపోయే మల్టీ స్టార‌ర్ సినిమా యాడ్ కానుంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ – ప్రభాస్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టార్ సినిమా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది.

దేవ‌ర‌ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల – ప్రభాస్ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాపై కథ క‌స‌ర‌త్తులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తుందని.. అలాగే యువీ క్రియేషన్స్ కూడా ఇందులో భాగస్వామిగా ఉండబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ వెంకటేష్ మల్టీస్టారర్ అంటే అది టాలీవుడ్ లోనే తిరుగులేని క్రేజీ కాంబినేషన్ గా నిలుస్తుంది అన్నడంలో సందేహం లేదు.

మొత్తానికి ప్రభాస్ క్రేజీ లైన‌ప్‌లో మరో అదిరిపోయే సినిమా అయితే వచ్చేసింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ జనాలు ఎంతో ఈగరగా వేయిట్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు. ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ ప‌లువురు టాలీవుడ్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ప్ర‌భాస్‌తో మ‌రో మంచి సినిమాలో క‌లిసి న‌టించ‌బోతున్నాడు.