పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి సీరిస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలతో సౌత్ లోనే కాకుండా.. బాలీవుడ్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు డార్లింగ్.
ఈ లిస్టులో ప్రభాస్ నుంచి ముందుగా వస్తోన్న ఆదిపురుష్ ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మరోవైపు సలార్, ప్రాజెక్ట్ కె వంటి సినిమాల షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ రెండు సినిమాల తర్వాత డీలక్స్ రాజా, స్పిరిట్ సినిమాలు లైన్లో ఉన్నాయి. తాజాగా ప్రభాస్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రభాస్ బయట చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. అలాగే తన సినిమాల్లో హీరోయిన్లతో ఎక్కువగా రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఇష్టపడడు. లిప్ లాక్ సీన్స్ విషయంలో ఈ పాన్ ఇండియా హీరో చాల వీక్. అందుకే తన మూవీస్‌లో అలాంటి సన్నివేశాలు వద్దు అని ప్రభాస్ చెబుతుంటాడట. రాధేశ్యామ్‌లో పూజాతో రొమాన్స్ చేసేందుకే నానా ఇబ్బందులు పడ్డాడట. ప్రభాస్ తన కేరీర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్లతో మత్రమే లిప్ లాక్ చేశాడు.
అలా చేసిన వారిలో ఒకరు అనుష్క కాగా మరొకరు త్రిష కావడం విశేషం. ప్రభాస్- త్రిష కాంబోలో వచ్చిన రెండో సినిమా పౌర్ణమి. ఈ సినిమాలో వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్‌లో లిప్‌లాక్ సీన్ ఉంటుంది. అలాగే బాహుబలి 2 సినిమాలో కూడా హంసనావ పాటలో కూడా ప్రభాస్ – అనుష్క మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. ఇలా ప్రభాస్ తన కెరీర్లో ఇప్పటివరకు ఈ ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడు.
రాధేశ్యామ్ సినిమాలో కూడా ప్రభాస్- పూజాతో కొంచెం హాట్ గా కనిపించిన రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాడని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ప్రభాస్ రొమాన్స్ లో వీక్ కావడంతో పెళ్లి చేసుకున్నా భార్యతోనూ ఇలాగే ఇబ్బంది పడతాడా … ఈ విషయంలో ఇంత సిగ్గరి అయితే ఎలా బాబు.. అందుకే పెళ్లి ఆలస్యం చేస్తున్నావా ? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లతో ప్రభాస్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.