చిత్ర పరిశ్రమల కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా మార్మోగుతోన్న ఒకే పేరు ఆది పురుష్. ఈ సినిమా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ఆది పురుష్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ఈ సినిమా నిన్న విడుదలైన తొలి షో తోనే పాజిటివ్ టాక్ వచ్చినా తర్వాత షోల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
రామాయణం కథ అందరికీ తెలిసిందే. అయినా దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ సినిమాను ఇప్పటివరకు వచ్చిన రామాయణాల కన్నా ఎంతో విచిత్రంగా తీశాడు.. దర్శకుడు కొత్తగా మరో రామాయణాన్ని సృష్టించాడు. దీంతో ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ప్రేక్షకుల నుంచి తీవ్ర స్థాయిలు విమర్శలు వస్తున్నాయి.
అంతే కాకుండా ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌కు భారీ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదే సమయంలో ఇలాంటి ఈ ప్రతిష్టాత్మక సినిమాను చేతులారా రిజెక్ట్ చేసుకున్న ఓ స్టార్ హీరో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ముందుగా దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను హృతిక్ రోషన్ తో చేయాలనుకున్నాడు. ఈ సినిమా కథ ఇప్పటివరకు వచ్చిన రామాయణాలకు భిన్నంగా ఉండడంతో పాటు యాక్షన్ సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ లేకపోవడంతో హృతిక్ రోషన్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
తర్వాత పలువురు బాలీవుడ్ హీరోలను సంప్రదించిన వారు నో చెప్పడంతో ప్రభాస్ దగ్గరకు రాగా ఆయన ఓకే చేశాడు. అలా ఈ సినిమా తెరకెక్కి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పుడు హృతిక్ రోషన్ ఈ సినిమాను రిజెక్ట్ చేసి బతికి పోయాడు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఓ గొప్ప సినిమాని పోగొట్టుకున్నాడని అంటున్నారు. ఇక మరి ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.