ప్రభాస్ పై ఈ మధ్యకాలంలో జనాలు కొంచెం ఎక్కువే ఫోకస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకి సంబంధించిన పలు విషయాలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కల్కి 2898AD చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే దీపిక పదుకొనేతో రొమాన్స్ పై స్పందించాడు ప్రభాస్. ప్రభాస్ మాట్లాడుతూ… దీపిక గురించి ఎంత చెప్పినా తక్కువే… ఆమె పెద్ద సూపర్ స్టార్ చాలా అందంగా ఉంటుంది.
ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి ఆమె అందం గురించి అందరికీ తెలుసు కదా… నేను ఇంకేం చెప్తాను… ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి సైతం యాడ్స్ ని చేసింది. దీపిక చాలా చాలా టాలెంట్… ఆమె తెరమీదకి వచ్చిందంటే కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. అందరిలో మరింత ఉత్సాహం వస్తుంది. తనతో ఎప్పటి నుంచో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నాను… కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఆ కోరిక నెరవేరింది. ఆమెని నటిగా బాగా ఇష్టపడుతును అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.
అయితే ప్రభాస్ మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేకపోయినా సరే కొందరు జనాలు ప్రభాస్ పై మండిపడుతున్నారు. మేము నీ నోటి నుంచి అనుష్క పేరు తప్పిస్తే మరి ఎవరిపై ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ వినడానికి ఇష్టపడం డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు నువ్వు త్వరగా పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎంత బాధ పడతావో మాకు తెలియదు కానీ మీ అభిమానులుగా మేము మాత్రం ఎంతో బాధపడతాం… ప్లీజ్ అనుష్కని పెళ్లి చేసుకో అంటు ప్రభాస్‌కు సజెషన్స్ ఇస్తున్నారు. దీపికాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు పరోక్షకంగా అనుష్క ఫ్యాన్స్ ని హట్ చేశాయి.