ప్ర‌భాస్ ఫేస్‌బుక్ అక్కౌంట్ హ్యాక్‌… హ్యాక‌ర్లు ఎంత చెత్త ప‌ని చేశారంటే..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఆదిపురుష్ త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తోన్న రెండు సినిమాల‌పై మామూలు అంచ‌నాలు లేవు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి – సలార్ పై పాన్ ఇండియా లెవ‌ల్లోనే ఇప్ప‌టికే తిరుగులేని హైప్ ఉంది.

ఈ రెండు సినిమాల‌తో పాటు ప్ర‌భాస్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. వీటిలో ముందుగా సెప్టెంబర్ లో సలార్ రిలీజ్ కానుండగా.. 2024లో కల్కి తో పాటు మారుతీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్ర‌భాస్ ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యింది.

ఈ అక్కౌంట్ నుంచి ఓ ఊహించ‌ని పోస్టు రావ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఒక్క‌సారిగా గందరగోళానికి గురయ్యారు. అయితే తన ఫేస్ బుక్ హ్యాక్ గు గురైంద‌ని తెలిపాడు. ఈ హాక్ సమస్యను పరిష్కరించడానికి టీమ్ గట్టిగా ప్రయత్నిస్తోందని ప్రభాస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా తన ఫ్యాన్స్ కి.. ఆడియన్స్ కి తెలిపాడు.