ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సీరిస్, సాహో సినిమాలతో పెదనాన్నకు మించిన స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. ప్రభాస్ కాంట్రవర్షియల్ మేటర్లకి దూరంగా ఉంటూ కామ్‌గా అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు.
గతంలో ప్రభాస్ ఓ స్టార్ హీరోయిన్ మొగరాయుడు అని విమర్శించినట్టు ఇండస్ట్రీ జనాల్లో ఎప్పటి నుంచో ఉన్న మాట. సాధారణంగా హీరోయిన్‌లు ఎన్ని మాట్లాడినా… సైలెంట్ ఏ మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోయే ప్రభాస్ ఒక హీరోయిన్ ని ఎందుకు ? అంత పెద్ద మాట అన్నాడు ? ఇంతకీ ఎవరా? హీరోయిన్ అన్నది అందరిలోనూ ఇంట్రస్టింగ్‌గా మారింది. డార్లింగ్ మూవీ షూటింగ్ టైంలో ప్రభాస్‌ని హీరోగా సెలెక్ట్ చేసుకున్న మూవీ టీం హీరోయిన్గా రకుల్‌ను సెలెక్ట్ చేసుకున్నారట.
ప్రభాస్ డైరెక్ట్‌గా మేకర్స్ ని కలిసి స్క్రిప్ట్ ప్రకారం ఈ పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం సూట్ కాదు.. ఆమె ఫేస్ మొత్తం మగ రాయుడులా ఉంటుంది… చాలా స్టైలిష్ గా మోడరన్‌గా. ట్రెండీగా ఉండే ఆ అమ్మాయి ఈ సినిమాలో అమాయకంగా కనిపించే హీరోయిన్ పాత్రకు సెట్ కాదని చెప్పేశాడట. తన పక్కన వేరే హీరోయిన్ తీసుకుంటే మంచిది సజెస్ట్ చేశాడట.
ఈ సజెషన్ ఫాలో అయిన మేకర్స్ కూడా ఆ తరువాత రకుల్ ప్రీత్ ని తీసేసి ఆ ప్లేస్‌లో కాజల్‌ని పెట్టారట. అప్పటికే రకుల్‌తో తీసిన సీన్లు అన్ని మళ్లీ కాజల్‌తో రీ షూట్ చేసుకున్నారు. కాజల్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ మూవీ ప్రభాస్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తర్వాత ఈ వార్తలు బయటకి రావడంతో ప్రభాస్ ..రకుల్ ప్రీత్‌ను ఏకంగా అంత మాట అన్నాడా అని బాగా చర్చించుకున్నారు.