ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వర్షం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన నటించి సూపర్ హిట్లను సాధించాడు. 2002లో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఇప్పటికీ ఫుల్ క్రేజ్ తో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే ఇలా వరుస సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నడు.
ఇప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ ప్రభాస్ కి కథ వినిపించగా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనారోగ్య కారణాలతో గత సంవత్సరం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇటీవల కాలంలోనే నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాలో నటిస్తోంది.
యూవీ క్రియేషన్ బ్యానర్లో అనుష్క ఆ సినిమాకు సైన్ చేసింది. అంతకుమించి అనుష్క మరి ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే అనుష్క – ప్రభాస్ ప్రేమలో ఉన్నారని కాగా ప్రభాస్ – కృతి సనన్ ని ప్రేమించడంతో.. అనుష్క – ప్రభాస్ కు బ్రేకప్ చెప్పిందని..ఇంతకుముందు ఎన్నో వార్తలు వచ్చాయి. దీంతో ఇకపై ప్రభాస్ కోసం అనుష్క సినిమా చేయడం అనేది జీవితంలో ఎప్పటికీ జరగదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
అనుష్క, ప్రభాస్ తో మరో సినిమా చేయబోతుందన్న వార్తల్లో ఏమాత్రం నిజం ఉండదు అంటు కొట్టి పడేస్తున్నారు. అనుష్క హీరోయిన్ ఫిజిక్ పోయింది. ఇప్పటికే ఆమె వయస్సు 40 +కు వచ్చేశాయి. దీంతో ఆమె ఇంత పెద్ద స్టార్‌డమ్ ఉన్న ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా చేయదనే అంటున్నారు. ప్రభాస్ – అనుష్క అభిమానులు మాత్రం సినిమా చేస్తారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా.. లేదా..? అనే విషయాన్ని చూడాల్సి ఉంది.