సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో జాతకాలను, దేవుళ్లను, పూజలను నమ్ముతూ ఉంటారు. మరి ముఖ్యంగా రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు ఈ విషయంలో మరింత ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది స్టార్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వారి జాతకం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే తెలుసుకుంటూ వాటికి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. చిత్రపరిశ్రమలో ఉండే దివంగత నటుడు ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా జాతకాలు నమ్ముతారని ఎన్నోసార్లు రుజువైంది.
ఈ రీసెంట్ టైమ్స్ లో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన విషయాలను నిజమవడంతో చాలామంది హీరోయిన్లు, హీరోలు ఆయన దగ్గర జాతకం చెప్పించుకోవడం కోసం క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా చేరాడు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ ఇప్పటివరకు దేవుళ్లను, జాతకాలు నమ్మడని.. ఆయనకు వాటి మీద అసలు నమ్మకమం ఉండదని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు.
కానీ ఇప్పుడు ఈ విషయం చూస్తే ప్రతి ఒక్కరూ ప్రభాస్ కూడా జాతకాలు నమ్ముతాడా ఏంటి.. అని అనుమానం రాకుండా మానదు. ప్రభాస్ హీరోగా వస్తున్న తాజా సినిమా సలార్ ఈ సినిమా టీజర్ ని మరో రెండు రోజుల్లో అనగా ఈనెల 6వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే సలార్ టీజర్ ని జూలై 6 ఉదయం 5:12 నిమిషాలకి రిలీజ్ చేస్తారట. ఇక్కడ ఒక డౌట్ రాకుండా మానదు. ఎవరికైనా..!
సాధారణంగా ఏ సినిమాకు అయినా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి సమయంలో టీజర్ ను రిలీజ్ చేస్తారు. కానీ సలార్ టీజర్ ఎవరూ నిద్ర లేవని టైంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ప్రభాస్ గతంలో వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ టీజర్, ట్రైలర్లు ఉదయం, మధ్యాహ్నం సమయంలోనే విడుదల చేశారు.
ఇక ఇప్పుడు సలార్ టీజర్‌ను ఎవరూ నిద్రలేవకముందు రిలీజ్ చేయడంతో నెటిజన్లు ప్రభాస్ కూడా జాతకాలు ఏమన్నా ఫాలో అవుతున్నారా ? అందుకే ఇలా ఉదయం పూట సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇస్తున్నారా.. అంటూ షాక్ అవుతున్నారు. ఏదేమైనాప్పటికీ ఇందులో అసలు విషయం తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.