‘ దేవ‌ర‌ ‘ లో ఎన్టీఆర్ డైలాగులు ఈ రేంజ్‌లోనా… ఊర‌మాస్ జాత‌రే…!

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా తెర‌కెక్కుతోంది. ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న కొరటాల.. ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ డిజాస్టర్ సినిమా తర్వాత దేవర సినిమాతో కొరటాల ఎలాగైన‌ హిట్ కొట్టాలనే క‌సితో తెరకెక్కిస్తున్నారు. కొరటాల సినిమాలో డైలాగ్స్ కొంచెం క్లాసుగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ , కొరటాలకు దేవర సినిమా డైలాగ్స్ పై కొన్ని హింట్స్ ఇచ్చాడట.

ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాలో ఉరమాస్ డైలాగ్స్ ఉండేలా చూసుకోమ‌ని సలహా ఇచ్చాడట.
కొర‌టాల శివ కూడా ఈ సూచనలను అంగీకరించాడంటున్నారు. ఈ సినిమా ఫ్యాన్స్ కోరుకునే ఊర మాస్ డైలాగ్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేవర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలోకి వ‌స్తోంది. ఏప్రిల్ నెల సెంటిమెంట్ పరంగా ఎన్టీఆర్‌కి కలిసి రాదన్న విషయం తెలిసిందే.

అయినా ఈసారి సెంటిమెంట్‌కి అతీతంగా దేవ‌ర‌ సినిమాతో కొత్త రికార్డ్ సృష్టించడానికి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నాడు తారక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా చేస్తోంది.

ప్రస్తుతం దేవర సినిమా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాల‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలో ఫుల్ మాస్ క్యారెక్టర్ తో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.