పోలీసుగా దుమ్ములేపిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

వెండి తెర‌పై నటినట్లు ఎవరైనా సరే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారంటే ప్రేక్షకులకు ఆ సినిమాపై ఎంతో ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడు స్టార్ హీరోలకు పోటీగా అగ్ర హీరోయిన్లు కూడా పోలీస్ పాత్రల్లో కనిపిస్తూ అదరగొడుతున్నారు. తమ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతకైనా తెగించే ముద్దుగుమ్మలు లాఠీ ప‌ట్టి ప్రేక్షకులను ఔరా అనిపిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఎలాంటి సినిమాల‌లైన‌ నటించగలమని నిరూపిస్తున్నారు.

మన పాత‌ తరం హీరోయిన్లు అయిన‌ శారద, సుహాసిని, విజయశాంతి, ట‌బు దగ్గర నుంచి నేటి తరం అగ్ర హీరోయిన్లైనా నయనతార వర‌కు ఎంతో మంది ముద్దుగుమ్మలు పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ క్రమంలోనే వెండితెరపై పోలీసు పాత్రలో కనిపించి మెప్పించిన స్టార్ హీరోయిన్లు ఎవరు ఇప్పుడు చూద్దాం.

తెలుగు చిత్ర పరిశ్రమలో చందమామ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు కాజల్ల్ అగర్వాల్. కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వ‌రుస‌ స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ స్టార్‌ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి కాజల్ అగర్వాల్ కూడా సత్యభామ అనే సినిమాలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సౌత్ పరిశ్రమకే లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార కూడా తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ కూడా మొదటిసారిగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో కలిసిన నటిస్తున్న జవాన్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తోనే ఎన్నో సంచనాల సృష్టించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో నయనతార ఎలాంటి ? రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్‌కి రీమేక్‌గా తెలుగులో వచ్చిన షాకిని డాకినీ సినిమాలో కూడా టాలీవుడ్ ముద్దుగుమ్మలు రెజీనా, నివేదా థామస్ కూడా పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. అలాగే మరో అగ్ర హీరోయిన్ జ్యోతిక కూడా ఝాన్సీ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి ప్రేక్షకులను ఔరా అనిపించింది. ఇక మరో బబ్లీ బ్యూటీ రాశీ కన్నా కూడా గ్లామర్ పాత్రలో నటించడమే కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్‌ సినిమాలో ఇన్స్పెక్టర్ శ్రీదేవి గా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ యాంకరింగ్ కు గుడ్ బాయ్‌ చెప్పింది. అనసూయ కూడా అడివి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇలా ఈ ముద్దుగుమ్మలే కాకుండా చాలామంది హీరోయిన్లు కూడా పోలీస్ ఆఫీసర్గా నటించడానికి సై అంటున్నారు.