నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు అంటే నందమూరి అభిమానులకు పండగ అనే విషయం అందరికి తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న భగవంత్ కేసరి నుంచి అదిరిపోయే టీజర్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఆయన 109వ సినిమాను కూడా స్టార్ దర్శకుడు బాబీతో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు.
ఇదే సమయంలో బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఈసారి బాలయ్య పుట్టినరోజు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ నటించబోయే మొదటి సినిమా రిలీజ్ డేట్‌పై అదిరిపోయే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. నందమూరి మోక్షజ్ఞ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మొదటి మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి అధికార ప్రకటన చేశారు. 2024 సెస్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారు? మోక్షజ్ఞకు జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? ఎవరు నిర్మిస్తారు ? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకటం లేదు. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక త్వరలోనే మోక్షజ్ఞ తొలి సినిమా షూటింగ్ కూడా మొదలుకానుందని తెలుస్తుంది. ఇప్పటికే మోక్షజ్ఞ కొత్త లుక్కుతో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు.
మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ త్వరలోనే రానున్నాయి. గర్జించడానికి రెడీ.. డేట్ గుర్తు పెట్టుకోండి అంటూ మోక్షజ్ఞ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ నందమూరి హీరో కెరియర్ పరంగా ఎన్నో సంచలనాలు సృష్టించడం ఖాయమని, ఇక తాత, తండ్రి, అన్న పేర్లను నిలబెడతారని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మోక్షజ్ఞ తన చేసే సినిమాల కథల విషయంలో, నటన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మారటం ఖాయం. ఇక మరి మోక్షజ్ఞ ఎలాంటి సినిమాలతో ? ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.
Ready To Roar 💥🔥🦁
Mark The Date : 06-09-24 ✅ pic.twitter.com/stOzl814lE— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) June 9, 2023