బాపు – రమణ ‘ పెళ్లిపుస్తకం ‘ సినిమా ఐడియా తెలిస్తే దిమ్మ‌తిరిగి పోద్ది మ‌రి..!

తెలుగు సినిమాలో కొన్ని సినిమాలు ఎప్పటికీ మనసులో గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో ‘ పెళ్లి పుస్తకం ‘ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 1991లో విడుదలైన సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా అప్పట్లోనే భారీ వ‌సూళ్లు తెచ్చిపెట్టింది. అంతేకాదు అప్పటివరకు ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ బాపుకు పెద్ద బ్లాక్ బస్టర్. దర్శకుడు బాపు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బాపు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కాంబోలో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరి కాంబోలోనే ‘ పెళ్లి పుస్తకం ‘ కూడా తెర‌కెక్కి మంచి హిట్ సినిమాగా చ‌రిత్ర‌లో నిలిచింది. ఎమోషన్ ప్రధాన అంశంగా పెళ్లి పుస్తకం తెరకెక్కింది. ఈ సినిమాతో మ‌రోసారి ఇండస్ట్రీలో వీరి పేర్లు మార్మోగాయి. రమణ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ల‌ను అందుకుంది.

పెళ్లిపుస్త‌కం చిన్న సినిమాగా విడుదల సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఒకరిపై మరొకరికి కలిగే ప్రేమ వల్ల‌ అసహనం, కోపం చాలా రొమాంటిక్ గా చూపించారు. ఈ సినిమాకి కెవి.మ‌హ‌దేవ‌న్ సంగీతం అందించారు. ఇప్పటికీ పెళ్లి వీడియో అంటే చాలు అందులో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ కథను నటుడు రావి కొండలరావు అందించారు.

ఈ కథను ‘ మిస్సమ్మ స‌కథ స్ఫూర్తితో క‌థ సిద్ధం చేయాల‌ని ప్ర‌య‌త్నించార‌ట ర‌చ‌యిత రావి కొండలరావు. ఈ సినిమా క‌థ‌లోకి వెళితే కొత్తగా పెళ్ళి చేసుకున్న కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ముంబైలోని ఒక సంస్థలో కళా దర్శకుడుగా ప‌ని చేస్తూ ఉంటాడు. అత‌డి భార్యే సత్యభామ (దివ్యవాణి) కేరళలో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తుంది. వీరిద్దరు పైనాన్షియ‌ల్ ఇబ్బందులు తొలగించుకునేందుకు ఒక పెద్ద సంస్థలో జాబ్ చేసేందుకు త‌మ‌కు పెళ్లి కాలేద‌ని గుమ్మడికి అబద్ధం చేబుతారు. ఆ త‌ర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చాయ‌న్న క‌థాంశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు.