Rx100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆమె నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ ఆ హాట్ అపీరియన్స్ తో కుర్రాళ్లను నిద్రపోనికుండా చేసింది. ఈ సినిమా తర్వాత వరుసగా 4,5 సినిమాలలో నటించిన అవి అంతగా సక్సెస్ కాలేదు. తాజాగా పాయల్ మాట్లాడుతూ నన్ను కావాలనే టాలీవుడ్ లో కొందరు మిస్‌గైడ్ చేశారని.. దానివల్ల నేను బిజీ స్టార్ కాలేకపోయినట్లు తెలిపింది.
ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత చాలామంది దర్శకులు, నిర్మాతలు మా సినిమాలో నటించమని బ్రతిమలాడారని.. హీరోల సరసన మంచి రోల్స్ వచ్చినా పాయల్ తన చుట్టూ ఉన్న కొంతమంది చెప్పిన మాటలు విని వాటిని వదిలేయాల్సి వచ్చిందని వాపోయింది. ఈ నిర్మాత , ఈ డైరెక్టర్ సినిమాలో నటించవద్దని ఆమెకి వచ్చిన అవకాశాలను కొందరు వెనక్కునట్టేసారట. వారు చిప్పినట్టు వింటే అన్ని సక్రమంగా జరుగుతాయని నమ్మానని.. అయితే వారంతా తన కెరీర్‌ను గందరగోళానికి గురిచేశారని వాపోయింది.
అప్పట్లో తాను హైదరాబాద్‌లో ఒంటరిగా ఉండడం.. తోడుగా ఎవరూ లేకపోవడంతో వాళ్ళ మాటలపై ఆధారపడాల్సి వచ్చిందని చెప్పింది పాయల్. టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది మాటలు విని మోసపోయానని.. ఇవన్నీ నేను ఆలస్యంగా తెలుసుకున్నానని ఇవన్నీ తెలిసేటప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపింది. ఈ రకమైన పద్ధతి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే ఉందని చెప్పింది.
అవకాశాలు వచ్చిన సమయంలో మధ్యవర్తులు మిస్‌గైడ్ చేయడం.. ఆ తర్వాత బెడ్‌రూ*కి వెళ్ళన్నందుకే కొందరు తెలుగులో సినిమా ఛాన్సులు లేకుండా తొక్కేశారని వాపోయింది. ఈ అవకాశాలే తాను టాలీవుడ్‌లో టాలెండ్ ఉండి కూడా వెనకపడిపోవడానికి కారణమని తెలిపింది. ప్రస్తుతం పాయల్ మంగళవారం అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.