పవన్ ఎంట్రీతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ … వామ్మో ఇదేం ఫాలోయింగ్ రా బాబు..!

బెల్లం చుట్టూ ఈగలు ముసురుకున్న‌ట్టు ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటారు. తమ అభిమాన హీరోని చూసేందుకు… టచ్ చేసేందుకు. ఆయ‌న‌తో ఫొటో దిగేందుకు ఫ్యాన్స్ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక త‌మ అభిమాన హీరో గురించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్లు తెలుసుకునేందుకు వారిని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతూనే ఉంటారు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోన్న ప‌వ‌న్ ఇటు రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ చాలా రోజుల త‌ర్వాత ఇన్‌స్టాల‌కి ఎంట‌ర్ అయ్యాడు.

వెలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో అనే ట్యాగ్‌తో తన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇలా అకౌంట్ క్రియేట్ చేశాడో లేదో ఒక్కసారిగా భారీ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాడు. త‌న ఇన్‌స్టా ఖాతాలో ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే 2 మిలియన్ల‌ ఫాలోవర్స్ దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం మెసేజ్ పెట్ట‌కుండానే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే.. రేపు ఇన్‌స్టాలో పోస్టులు మొద‌లైతే అసలు ప‌వ‌న్ ఫాలోయింగ్‌ను ప‌ట్టుకోవ‌డం ఏ హీరోకు సాధ్యం కాదేమో..!

పవర్ స్టార్ ప్రస్తుతానికి త‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి న‌టిస్తోన్న‌ బ్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కానుంది. అలాగే ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ సినిమాలు చేస్తున్నాడు.