ఇండస్ట్రీలో ఒక సినిమా రూపొందించాలంటే ఆ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, సెట్ బాయ్స్, మ్యూజిక్ డైరెక్టర్, కొరియేగ్రాఫర్ , హీరో , హీరోయిన్ ఇలా ఎంతోమంది కష్టపడాల్సి వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమాలో హీరోనే లేకుండా సినిమా షూటింగ్ పూర్తయిపోతే ఎలా ఉంటుంది. హీరో లేకుండా షూటింగ్ ఎలా.. అనుకుంటున్నారా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్ మూవీ షూటింగ్ అలాగే జరుపుకుంటుంది. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందన్న విషయమే ఎవరికీ తెలియదు ప్రభాస్ లేకపోయినా ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటారా.. పాసిబుల్ అంతే.
అలాగే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ కాకుండానే 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మళ్లీ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటారా పాజిబుల్ అంతే. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో, ఓజి తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హర హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉస్తాద్ సింగ్ షూటింగ్ నాలుగు రోజులు బానే జరుపుకుంది అప్పట్లో హరి శంకర్ మనల్ని ఎవడ్రా ఆపేది అనే ఒక తోపు డైలాగులు ట్విట్ చేశాడు. కానీ అప్పటినుంచి సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ మొదలు కాలేదు.
దీంతో ఈ సినిమాని ఆపేస్తున్నారంటే న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే, సల్లార్ సినిమాల గురించే కానీ రాజా డీలక్స్ సినిమా షూటింగ్లో ప్రభాస్ మాత్రం అసలు పాల్గొన్నటే కనిపించలేదు. కానీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈ రెండు సినిమాలు షూటింగ్ దాదాపు పూర్తయిపోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డూప్లని పెట్టి సినిమాను తీసేస్తున్నారేమో అనే డౌట్స్ ఆడియన్స్లో తలెత్తాయి. దీంతో వీళ్ళు రియల్ హీరోల.. డూప్ బాబులా.. అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.