పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా ఇంత సెంటిమెంట‌ల్ అమ్మాయా…!

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలిసిందే. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మూడో భార్య‌ అన్నా లెజినోవా పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మూడో భార్య‌కికూడా విడాకులు ఇచేశాడంటూ, విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వైర‌ల్ అయ్యాయి. దీంతో అన్నా లెజినోవా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే విషయాలపై ప్రజలు సెర్చింగ్ మొదలు పెట్టారు.

అన్నా లెజినోవా ఒక రష్యన్ అమ్మాయి. మొదట పవన్ కళ్యాణ్‌ని తీన్మార్ సినిమా షూటింగ్ టైంలో కలిసింది. వీరిద్దరి మధ్య స్నేహం బలపడి ప్రేమగా మారడంతో వీరిద్దరు కొంతకాలం సహజీవనం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ అన్నాను వివాహం చేసుకోవాలనుకున్నాడు. దాంతో రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చి ఎర్రగడ్డ సబ్‌రిజిస్టార్ ఆఫీసులో స్పెషల్ మ్యారేజ్ కేటగిరీలో వీరిద్దరూ కులాంతర వివాహం జరుపుకున్నారు.

వీరికి వివాహం తర్వాత నుంచి లెజినోవ తన ఆచార సాంప్రదాయాలను వదిలేసి భారతీయ సాంప్రదాయంలోకి అడుగుపెట్టింది. పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ కలిసి నైట్ డిన్న‌ర్‌కి వెళ్లినా.. ఎప్పుడు బయట సాంప్రదాయంగానే కనిపించేది. అలాగే మెగా ఫ్యామిలీలో జరిగే అన్ని శుభకార్యాలలో ఈమె మెగా ఫ్యామిలీతో కలిసిపోతూ సాంప్రదాయ బద్దంగానే నడుచుకుంటోంది.

మెగా ఫ్యామిలీకి కూడా అన్నా లెజినోవా అంటే చాలా ఇష్టమట. ఇక వీరిద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పేరు పోలేనా అంజన, కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. పవన్ కళ్యాణ్ ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్లే ముందు అతనికి హారతి ఇచ్చి.. బొట్టు పెట్టి.. కారుకు పూజ చేస్తుంది. అలా ప‌వ‌న్‌ను లెజినోవా పంపించే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె పూర్తిగా మన సాంప్రదాయాన్ని పాటిస్తుందని అర్థం అయిపోయింది.