పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ కరుణాకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ తొలిప్రేమ ‘. కీర్తి రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎన్నో లవ్ స్టోరీస్ నటించినా తొలిప్రేమ ఒక ప్రత్యేకమైన హోదాను దక్కించుకుంది. తొలిప్రేమ పవన్ కళ్యాణ్ నటించిన 4వ సినిమా అయినా మొదట మూడు సినిమాలు వేరే సినిమాలకు రీమేక్ గా వచ్చినవి. అది కూడా పెద్ద పెద్ద దర్శకుల డైరెక్షన్లో ఆ సినిమాల్లో నటించాడు. కానీ మొదటిసారి ఒక కొత్త స్టోరీ తో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని కరుణాకరన్ డైరెక్షన్ లో నటించిన తొలిప్రేమ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలవడమే కాక ఇప్పటికీ క్లాసికల్ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ గా నిలిచిపోయింది.
1998లో రిలీజైన ఈ సినిమా ఇటీవల్ల మళ్లీ థియేటర్లో రీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో అలి, వేణుమాధవ్, రవిబాబు, నాగేష్, సంగీత, విజయ్ ఇలా ఎంతోమంది ప్రముఖ నటులు కీరోల్స్ ప్లే చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవా ఈ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలు అప్పటిలో ఓ రేంజ్ లో క్రేజ్‌ని సంపాదించుకున్నాయి. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటే ఒకటి కూడా డ్యూయెట్ సాంగ్ లేకపోవడం విశేషం.
దానితోపాటు వన్ సైడ్ లవ్ స్టోరీ కారణంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ స్టోరీ లాస్ట్ లో మాత్రమే ఒకరితో ఒకరు ప్రేమను చెప్పుకుంటారు. ఈ సినిమాలో ‘ ఏమైందో ఏమో ఈవేళ సాంగ్ ‘ ని హీరో నితిన్ తన ” గుండెజారి గల్లంతయిందే ” సినిమాలో రీమేక్ గా పెట్టుకోవడం మరో విశేషం. 1998లో రిలీజైన ఈ సినిమా 21 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాలలో 200 రోజులు ఆడింది. 365 రోజుల లాంగ్ రన్ చేసిన సినిమాలలో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకుంది. అంతేకాకుండా తొలిప్రేమ సినిమాను 2000లో కన్నడ 2001లో హిందీ భాషలలో కూడా రీమేక్ చేశారు.