రీ రిలీజ్‌కు ఇంత పెద్ద క‌టౌట్… ‘ తొలిప్రేమ ‘ రీ రిలీజ్ రికార్డులు చూడండ్రా సామి…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా బ్యాక్‌గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కొన్ని కోట్లాదిమంది ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

అయితే ఇటీవల రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టాడు ప‌వ‌న్. అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో భారీ కలెక్షన్స్ వసూలు చేశాయి. ప్రస్తుతం కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన తొలిప్రేమ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలు భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డుల దుమ్ము రేపుతుండ‌డంతో తొలిప్రేమ రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు.

తన అభిమాన హీరో సినిమా ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ కలెక్షన్లు వసూలు చేసేలా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఇటీవల తొలిప్రేమ రిలీజ్ అయే ఒక‌ థియేటర్ వద్ద 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయడం ప్రస్తుతం రీ రిలీజైన మూవీస్‌కు ఇలా భారిస్తాయిలో ఏర్పాట్లు జరగలేదు. కేవలం తొలిప్రేమ సినిమాకే ఇది జరగడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ సినిమా రీ రిలీజ్ అవుతోన్న చాలా థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికే చాలా షోలు హౌస్‌ఫుల్స్ అయిపోయాయి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా. ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. ఈ టైంలో రీ రిలీజ్ డేట్‌కు మూడు రోజుల ముందే అన్ని షోలు హౌస్ ఫుల్స్ ప‌డ‌డం అంటే తొలిప్రేమ మానియా ఎలా ? ఉందో చూస్తున్నాం.