ప‌వ‌న్ ఆమెతో ఆ ప‌ని చేస్తుండ‌గా క‌ళ్లారా చూసిన రేణుదేశాయ్‌.. అందుకే మ‌న‌సు ముక్క‌లైందా..!

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో విడాకులు… మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక‌.. త‌న భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేసింది. ఎప్పుడో ఆరేడు నెల‌ల నుంచి కూడా వీరిద్ద‌రు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీలో విడాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ప‌వ‌న్ కళ్యాణ్‌కు రెండు విడాకులు, చిరు చిన్న‌కుమార్తె శ్రీజ కూడా దాదాపు రెండో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు రెడీగా ఉండ‌డం న‌డుస్తోంది.

అటు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌ల్లి విజ‌య‌దుర్గ కూడా త‌న భ‌ర్త ప్ర‌సాద్‌కు విడాకులు ఇచ్చేసింది. ఇక ఇప్పుడు నిహారిక వంతు వ‌చ్చింది. ఇదిలా ఉంటే మెగా కాంపౌండ్ లో విడాకులనగానే ఎవరికైనా ముందుగా పవన్ కల్యాణ్ పేరే మ‌దిలో మెదులుతుంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే ఇద్ద‌రు భార్య‌ల‌కు విడాకులు ఇచ్చేశాడు. ప‌వ‌న్ ముందుగా వైజాగ్‌కు చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. ఆ బంధం ఎక్కువ రోజులు సాగక ఆమెకు విడాకులిచ్చారు.

ఆ తర్వాత ప్ర‌ముఖ నటి రేణు దేశాయ్ కు ప‌వ‌న్ బాగా కనెక్ట్ అయ్యారు. వీరిద్ద‌రు ఫ‌స్ట్ టైం బద్రి సినిమా షూటింగ్‌లో కలిశారు.. ఆ త‌ర్వాత మ‌రోసారి జానీలో కూడా మెరిశారు. ప్రేమ‌లో ప‌డి 2009లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి టైమ్ కే వీళ్లకు అకిరా పుట్ట‌గా… పెళ్లి తర్వాత ఆద్య పుట్టింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్ల‌డం, ఆరెంజ్ సినిమా ప్లాప్‌.. ప‌వ‌న్ అన్న నాగ‌బాబును ఆదుకునేందుకు భారీగా సాయం చేయ‌డం.. ఇవ‌న్నీ రేణుకు న‌చ్చ‌క‌పోవ‌డంతో గ్యాప్ వ‌చ్చేసింది.

అయితే అదే టైంలో మ‌రో సంఘ‌న‌ట కూడా జ‌రిగిందంటారు. ప‌వ‌న్ తీన్‌మార్ షూటింగ్‌లో ర‌ష్య‌న్ అమ్మాయి ( ప‌వ‌న్ మూడో భార్య అన్నా లెజ్నోవా)తో ప్రేమ‌లో ప‌డ్డాడు. అన్నాను ప‌వ‌న్ ఏకంగా త‌న ఇంటికే తీసుకొచ్చేసి కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టేశాడ‌ట ప‌వ‌న్‌. ఓ రోజు రేణుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవ‌డంతో అప్ప‌టికే ప‌వ‌న్ వ‌ల్ల విసిగిపోయి ఉన్న రేణు మ‌న‌సు మ‌రింత‌గా విరిగిపోయింద‌ట‌.

వెంట‌నే ఆమె ప‌వ‌న్‌కు దూరంగా పూణే వెళ్లిపోయింది. అలా వాళ్లు 2012లో విడిపోయారు. రేణు గత ఆరోపణల ప్రకారం, ఆమెతో వైవాహిక జీవితంలో ఉన్న‌ప్పుడే మ‌రో అమ్మాయితో క‌నెక్ట్ అయ్యి ఉండ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.